ఉప్పుడు బియ్యంగా తడిసిన ధాన్యం

ఇటీవల కురిసిన వర్షాలకు రాష్ట్రంలో తడిసిన ధాన్యాన్ని పోషకాలతో కూడిన ఉప్పుడు బియ్యం(ఫోర్టిఫైడ్‌ బాయిల్డ్‌ రైస్‌)గా మార్చాలని పౌరసరఫరాల శాఖ తాజా ఉత్తర్వుల్లో మిల్లర్లకు స్పష్టం చేసింది. వర్షాలకు 4.94 లక్షల టన్నుల ధాన్యం తడిసినట్లు

Published : 10 Aug 2022 04:49 IST

7.35 లక్షల టన్నుల ధాన్యం కేటాయింపు

ఈనాడు, హైదరాబాద్‌: ఇటీవల కురిసిన వర్షాలకు రాష్ట్రంలో తడిసిన ధాన్యాన్ని పోషకాలతో కూడిన ఉప్పుడు బియ్యం(ఫోర్టిఫైడ్‌ బాయిల్డ్‌ రైస్‌)గా మార్చాలని పౌరసరఫరాల శాఖ తాజా ఉత్తర్వుల్లో మిల్లర్లకు స్పష్టం చేసింది. వర్షాలకు 4.94 లక్షల టన్నుల ధాన్యం తడిసినట్లు జిల్లాల అదనపు కలెక్టర్లు నివేదిక ఇచ్చారు. ఈ క్రమంలో అయిదు లక్షల టన్నుల ఉప్పుడు బియ్యాన్ని సిద్ధం చేయాలన్న నిర్ణయానికి అనుగుణంగా 7.35 లక్షల టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్‌కు కేటాయించింది(7.35 లక్షల టన్నుల ధాన్నాన్ని మరపడితే 5 లక్షల టన్నుల బియ్యం వస్తాయి). ప్రస్తుతానికి 4.45 లక్షల టన్నుల ధాన్యాన్ని జిల్లాల వారీగా కేటాయించినట్లు, మిగిలిన ధాన్యాన్ని త్వరలో కేటాయిస్తామని పౌరసరఫరాలశాఖ ఉత్తర్వుల్లో వివరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని