గ్రామీణ బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రతిపాదన ఉపసంహరించుకోవాలి

గ్రామీణ బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రతిపాదన ఉప సంహరించుకోవాలని అఖిల భారత ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐఆర్‌ఆర్‌బీఈఏ) ప్రధాన కార్యదర్శి ఎస్‌.వెంకటేశ్వరరెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రైవేటీకరణ ప్రతిపాదనను

Published : 11 Aug 2022 04:32 IST

సెప్టెంబరు 23న దేశవ్యాప్త సమ్మె

ఈనాడు, దిల్లీ : గ్రామీణ బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రతిపాదన ఉప సంహరించుకోవాలని అఖిల భారత ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐఆర్‌ఆర్‌బీఈఏ) ప్రధాన కార్యదర్శి ఎస్‌.వెంకటేశ్వరరెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రైవేటీకరణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ సంఘం ఆధ్వర్యంలో జంతర్‌మంతర్‌లో బుధవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో 22 వేల శాఖలతో 42 కోట్ల ఖాతాదారులకు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు సేవలందిస్తున్నాయన్నారు. ప్రస్తుత ప్రభుత్వం గ్రామీణ బ్యాంకుల్లో ప్రైవేటు రంగానికి వాటా కల్పించేలా చట్టంలో మార్పులు తీసుకొచ్చిందని విమర్శించారు. గ్రామీణ బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమం చేస్తామన్నారు. సెప్టెంబరు 23న దేశవ్యాప్తంగా గ్రామీణ బ్యాంకుల్లో ఒకరోజు సమ్మె నిర్వహిస్తామని వెల్లడించారు. గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, 15 వేల మంది తాత్కాలిక ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేశారు. ధర్నాకు ఆమ్‌ఆద్మీ పార్టీ, వైకాపా రాజ్యసభ సభ్యులు సంజయ్‌ సింగ్‌, ఆర్‌.కృష్ణయ్య సంఘీభావం తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని