ప్రాజెక్టులకు కొనసాగుతున్న నీటి ప్రవాహం

కృష్ణా ప్రాజెక్టులకు నీటి ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లను 15 అడుగుల మేరకు ఎత్తి 3.76 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. నాగార్జునసాగర్‌కు 3.89 లక్షల క్యూసెక్కుల

Published : 14 Aug 2022 05:16 IST

శ్రీశైలం 10 గేట్లు, సాగర్‌ 26 గేట్ల ఎత్తివేత

ఈనాడు, హైదరాబాద్‌: కృష్ణా ప్రాజెక్టులకు నీటి ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లను 15 అడుగుల మేరకు ఎత్తి 3.76 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. నాగార్జునసాగర్‌కు 3.89 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండటంతో 24 గేట్లను 10 అడుగులు, 2 గేట్లను 5 అడుగుల మేరకు ఎత్తి పులిచింతల వైపు నీటిని విడుదల చేస్తున్నారు. విద్యుత్‌ ఉత్పత్తి, కాల్వలు, స్పిల్‌వే ద్వారా 4.09 లక్షల క్యూసెక్కులు విడుదలవుతున్నాయి. సాగర్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను.. శనివారం పొద్దుపోయే సమయానికి 586.30 అడుగుల వద్ద నీటిమట్టం ఉంది. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాన్ని బట్టి నీరు విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. పులిచింతల జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 175 అడుగులకు 168.20 అడుగుల వద్ద నీటిమట్టం కొనసాగిస్తున్నారు. ఈ ప్రాజెక్టు నుంచి 13 గేట్ల ద్వారా 3.35 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.  ఎగువన ఆలమట్టి, నారాయణపూర్‌ జలాశయాల వద్ద శనివారంతో పోల్చితే ఆదివారం నాటికి కొంత ప్రవాహం పెరిగింది. గోదావరి పరీవాహకంలో కాళేశ్వరం ఎత్తిపోతల్లోని లక్ష్మీ (మేడిగడ్డ) బ్యారేజీ వద్ద నీటి విడుదల కొనసాగుతోంది. ప్రాణహిత నుంచి వరద వస్తుండటంతో బ్యారేజీ నుంచి 11.18 లక్షల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని