గ్రామాల్లో మలేరియా ముప్పుపై హక్కుల కమిషన్‌ నోటీసులు

రాష్ట్రంలోని 587 గ్రామాల్లో మలేరియా ముప్పు పొంచి ఉందని, ఆ గ్రామాల్లో నివసించే 2,36,317 మంది ఆరోగ్యాలపై దీని ప్రభావం పడే ప్రమాదముందంటూ వైద్య, ఆరోగ్య శాఖ సర్వేలో వెల్లడైందని

Published : 19 Aug 2022 03:52 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని 587 గ్రామాల్లో మలేరియా ముప్పు పొంచి ఉందని, ఆ గ్రామాల్లో నివసించే 2,36,317 మంది ఆరోగ్యాలపై దీని ప్రభావం పడే ప్రమాదముందంటూ వైద్య, ఆరోగ్య శాఖ సర్వేలో వెల్లడైందని ఇటీవల మీడియాలో వచ్చిన కథనాలపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ స్పందించింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, ములుగు, భూపాలపల్లి, వరంగల్‌ జిల్లాల్లోని గ్రామాల్లో మలేరియా ముప్పు ఉందని అధికారులు గుర్తించినట్లు వార్తలు వచ్చాయి. వీటిని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ సుమోటోగా తీసుకుంది. ఆయా గ్రామాల్లో మలేరియా నివారణకు తీసుకుంటున్న చర్యలపై సెప్టెంబరు 28లోపు నివేదిక అందించాలంటూ మలేరియా, ఫైలేరియా శాఖల అదనపు సంచాలకులు, స్టేట్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌, వైద్య, ఆరోగ్య శాఖ సంచాలకులకు కమిషన్‌ నోటీసులు పంపించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని