బిషప్‌ ఏసీ సాల్మన్‌రాజు సస్పెన్షన్‌పై వివాదం

చర్చ్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా(సీఎస్‌ఐ) మెదక్‌ డయాసిస్‌ బిషప్‌ రైట్‌ రెవరెండ్‌ ఏసీ సాల్మన్‌రాజును చెన్నైలోని సినాడ్‌ సెక్రటేరియేట్‌ మోడరేటర్‌ ధర్మరాజ్‌ రసాలం సస్పెండ్‌ చేశారు.

Published : 30 Nov 2022 03:43 IST

కొత్తగా డోర్నకల్‌ బిషప్‌ పద్మారావు నియామకం
సీఎస్‌ఐ మెదక్‌ డయాసిస్‌ వద్ద హైడ్రామా
ఇరు వర్గాల ఘర్షణతో ఉద్రిక్తత

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: చర్చ్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా(సీఎస్‌ఐ) మెదక్‌ డయాసిస్‌ బిషప్‌ రైట్‌ రెవరెండ్‌ ఏసీ సాల్మన్‌రాజును చెన్నైలోని సినాడ్‌ సెక్రటేరియేట్‌ మోడరేటర్‌ ధర్మరాజ్‌ రసాలం సస్పెండ్‌ చేశారు. కొత్తగా డోర్నకల్‌ బిషప్‌ రైట్‌ రెవరెండ్‌ పద్మారావును నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు. పద్మారావు మంగళవారం సికింద్రాబాద్‌ రెజిమెంటల్‌బజార్‌లోని డయాసిస్‌ కార్యాలయానికి రావడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. తనను సస్పెండ్‌ చేసినట్లు ఉత్తర్వులు అందలేదని, డయాసిస్‌ కార్యకలాపాల్లో ఎవరూ జోక్యం చేసుకోకుండా కోర్టు ఉత్తర్వులున్నాయని సాల్మన్‌రాజు వారితో చెప్పారు. సినాడ్‌ సుప్రీం అని, అక్కడ ఇచ్చే ఉత్తర్వులే చెల్లుతాయని పద్మారావు వర్గం వాదించింది. ఈ క్రమంలో  గోపాలపురం ఏసీపీ సుధీర్‌, ఇన్‌స్పెక్టర్‌ సాయిఈశ్వర్‌గౌడ్‌ ఇరువర్గాలను ఠాణాకు తరలించారు.  సాయంత్రానికి గొడవ సద్దుమణిగింది. సినాడ్‌లో కోశాధికారిగా ఉండే విమల్‌ సుకుమార్‌, డయాసిస్‌లో వైస్‌ఛైర్మన్‌ రెవరెండ్‌ భాస్కర్‌, కోశాధికారి డేనియల్‌, సువర్ణరావుల కుట్రతోనే తనను సస్పెండ్‌ చేశారని సాల్మన్‌రాజు ఆరోపించారు. రూ.35లక్షల విలువైన స్థలం విషయంలో తాను అడ్డుపడటం, సినాడ్‌ ఎన్నికల్లో పోటీ పడబోతున్నాననే ఉద్దేశంతో తన అడ్డు తొలగించుకునేందుకు అభియోగాలు మోపి సస్పెండ్‌ చేశారని ఆరోపించారు. డయాసిస్‌ బిషప్‌ కార్యకలాపాల్లో, డయాసిస్‌ పరిపాలనలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని కోర్టు ఉత్తర్వులిచ్చిందన్నారు. భాస్కర్‌, డేనియల్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు తెలిపారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని