బోధనాసుపత్రుల్లో 184 వైద్య పోస్టుల భర్తీ

రాష్ట్రంలోని వేర్వేరు ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో 184 వైద్యుల పోస్టులను భర్తీ చేయాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది.

Published : 02 Dec 2022 04:00 IST

ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు
9న వాకిన్‌ ఇంటర్వ్యూలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని వేర్వేరు ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో 184 వైద్యుల పోస్టులను భర్తీ చేయాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. అన్ని పోస్టులూ ఆచార్యులు, సహ ఆచార్యుల హోదాకు చెందినవే. వీరిని ఏడాది కాలానికి ఒప్పంద ప్రాతిపదికన నియమిస్తారు. అర్హులైన వైద్యులు ఈ నెల 9న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ కోఠిలోని వైద్యవిద్య సంచాలకుల కార్యాలయంలో వాకిన్‌ ఇంటర్వ్యూలకు హాజరు కావాలని డీఎంఈ డాక్టర్‌ రమేశ్‌రెడ్డి తెలిపారు. ఆచార్యులకు నెలకు రూ.1.90 లక్షలు, సహ ఆచార్యులకు రూ.1.50 లక్షల చొప్పున వేతనం చెల్లిస్తారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఈ నెల 12న వెల్లడిస్తారు. నియమితులైన వైద్యులు నిర్దేశిత ప్రభుత్వ బోధనాసుపత్రిలో ఈ నెల 19వ తేదీలోపు చేరాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని