‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి

రాష్ట్రంలో ఆరోగ్యమహిళ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు కోరారు. రాష్ట్రంలో మహిళల సంపూర్ణ ఆరోగ్యం లక్ష్యంగా ఈ కార్యక్రమం అమలవుతోందని బుధవారం.

Published : 23 Mar 2023 04:07 IST

మంత్రి హరీశ్‌రావు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆరోగ్యమహిళ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు కోరారు. రాష్ట్రంలో మహిళల సంపూర్ణ ఆరోగ్యం లక్ష్యంగా ఈ కార్యక్రమం అమలవుతోందని బుధవారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. వంద ఆరోగ్య కేంద్రాల్లో దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఆరోగ్యమహిళ కార్యక్రమంలో భాగంగా రెండు మంగళవారాల్లో రాష్ట్రంలో 11,121 మంది మహిళలకు వైద్యపరీక్షలు చేసినట్లు వైద్యఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రత్యేక అవసరాలున్న వారికి మందులు అందచేయడంతో పాటు ఉన్నతస్థాయి వైద్యం, అదనపు పరీక్షలు అవసరమైన వారికి రిఫరల్‌ ఆసుపత్రుల్లో సేవలకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు.

నీటిని సంరక్షించుకుందాం

రాష్ట్ర ప్రజలకు మంత్రి హరీశ్‌రావు ట్విటర్‌లో ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా మరో ట్వీట్‌ చేశారు. ‘‘సీఎం కేసీఆర్‌ ఆలోచనలతో ప్రారంభించిన కాళేశ్వరం, మిషన్‌ భగీరథ పథకాలు తెలంగాణ జీవన గమనాన్ని మార్చాయి. నీటి సంరక్షణ, జల వనరుల నిర్వహణ పద్ధతులను అవలంబించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని