నిఖత్‌ జరీన్‌.. తెలంగాణ గర్వించదగిన బిడ్డ: కేసీఆర్‌

మహిళల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు మరోసారి బంగారు పతకం సాధించిపెట్టిన నిఖత్‌ జరీన్‌ తెలంగాణ గర్వించదగిన బిడ్డ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందించారు.

Updated : 27 Mar 2023 06:21 IST

ఈనాడు, హైదరాబాద్‌: మహిళల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు మరోసారి బంగారు పతకం సాధించిపెట్టిన నిఖత్‌ జరీన్‌ తెలంగాణ గర్వించదగిన బిడ్డ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందించారు. వరుస విజయాలతో దేశఖ్యాతిని ఆమె మరోసారి ప్రపంచానికి చాటిచెప్పారని కొనియాడారు. ఆదివారం 50 కేజీల విభాగంలో జరిగిన ఫైనల్స్‌లో నిఖత్‌ జరీన్‌ విజయం సాధించడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ పోటీల్లో రెండో బంగారు పతకం సాధించడం గొప్ప విషయమని శుభాకాంక్షలు తెలిపారు. క్రీడాభివృద్ధికి, క్రీడాకారుల ప్రోత్సాహం, సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ దిశగా తమ కృషి కొనసాగిస్తూనే ఉంటామని స్పష్టంచేశారు. బాక్సింగ్‌లో స్వర్ణ పతకం సాధించిన నిఖత్‌ జరీన్‌కు మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని