మూల్యాంకన వేళ.. సెల్‌ఫోన్ల గోల

కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ సాగాల్సిన ఇంటర్‌ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఆదిలాబాద్‌ జిల్లాలో గాడి తప్పింది.

Updated : 02 Apr 2023 04:54 IST

ట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ సాగాల్సిన ఇంటర్‌ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఆదిలాబాద్‌ జిల్లాలో గాడి తప్పింది. ఆదిలాబాద్‌ ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల కేంద్రంలో మూల్యాంకనం చేసే అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు యథేచ్ఛగా సెల్‌ఫోన్లు వినియోగిస్తున్నారు. కొందరు జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తూనే ఫోన్‌ మాట్లాడుతున్నారు. నిబంధనల ప్రకారం మూల్యాంకన సమయంలో వాటికి అనుమతి లేదు. ఈ క్రమంలో ఏకాగ్రత కోల్పోయి ఏమాత్రం అశ్రద్ధగా మూల్యాంకనం చేసినా విద్యార్థుల భవిత ప్రశ్నార్థకంగా మారుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

 ఈనాడు, ఆదిలాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు