సిడ్నీలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఆస్ట్రేలియన్‌ తెలంగాణ ఫోరం(ఏటీఫ్‌) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు ఘనంగా జరిగాయి.

Published : 06 Jun 2023 04:52 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఆస్ట్రేలియన్‌ తెలంగాణ ఫోరం(ఏటీఫ్‌) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రవాస భారతీయులు, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొని తెలంగాణ అమరవీరులకు, ఆచార్య జయశంకర్‌కు నివాళులర్పించారు. హార్వే లోవే పెవిలియన్‌- కాజిల్‌ హిల్స్‌లో తెలంగాణ కల్చరల్‌ నైట్‌ను కనులపండువగా నిర్వహించారు. పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొని తమ ఆటపాటలతో అతిథులను ఉర్రూతలూగించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించే సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. స్థానిక పారామాటా మేయర్‌ సమీర్‌ పాండే ముఖ్యఅతిథిగా హాజరవగా.. ప్రత్యేక అతిథిగా పాల్గొన్న తెలంగాణ గవర్నర్‌ కార్యదర్శి, ఐఏఎస్‌ అధికారి సురేంద్ర మోహన్‌ బతుకమ్మ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్‌ టౌన్‌ కౌన్సెలర్‌ లివింగ్‌స్టన్‌ చిటిపల్లి, ఏటీఫ్‌ అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌ కడపర్తి, కోశాధికారి వినయ్‌కుమార్‌ యమ, ప్రధాన కార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి ముద్దం, ఉపాధ్యక్షురాలు వాణి ఏలేటి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని