అంధులకు వీఐపీ దర్శనం

యాదాద్రి ప్రధాన ఆలయంలో శనివారం ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ముగ్గురు అంధులు స్వామివారిని దర్శించుకునేందుకు రాగా.. అక్కడే విధుల్లో ఉన్న ఆలయ ఈవో భాస్కర్‌రావు కంటపడ్డారు.

Published : 05 May 2024 04:28 IST

యాదాద్రి ప్రధాన ఆలయంలో శనివారం ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ముగ్గురు అంధులు స్వామివారిని దర్శించుకునేందుకు రాగా.. అక్కడే విధుల్లో ఉన్న ఆలయ ఈవో భాస్కర్‌రావు కంటపడ్డారు. వారు హైదరాబాద్‌కు చెందిన ఉదయ్‌, అన్వేష్‌, హుస్సేన్‌లని తెలుసుకున్నారు. అనంతరం ఆలయ ఈవో స్వయంగా వారిని గర్భాలయంలోకి తీసుకెళ్లి ప్రొటోకాల్‌ వీఐపీ దర్శనాన్ని కల్పించారు. వారు ఏటా క్షేత్రాన్ని సందర్శిస్తున్నట్లు చెప్పారు. స్వామి అనుగ్రహం వల్లే తాము గర్భాలయంలోకి ప్రవేశించామని సంతోషం వ్యక్తం చేశారు. ఇన్నేళ్ల తన వృత్తిలో సంతృప్తినిచ్చిన సేవ ఇదేనంటూ ఈవో భావోద్వేగానికి గురయ్యారు.

న్యూస్‌టుడే, యాదగిరిగుట్ట అర్బన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని