టీఎస్‌సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, లెక్చరర్‌ నియామకాల కోసం నిర్వహించే అర్హత పరీక్ష ‘తెలంగాణ స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌- 2024’ నోటిఫికేషన్‌ విడుదలైంది.

Published : 05 May 2024 04:26 IST

14 నుంచి దరఖాస్తుల స్వీకరణ

లాలాపేట, న్యూస్‌టుడే: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, లెక్చరర్‌ నియామకాల కోసం నిర్వహించే అర్హత పరీక్ష ‘తెలంగాణ స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌- 2024’ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించే సెట్‌ పరీక్ష నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి, ఇతర ప్రొఫెసర్లు శనివారం నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఆగస్టు 28, 29, 30, 31 తేదీల్లో సెట్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు సభ్య కార్యదర్శి ప్రొఫెసర్‌ నరేశ్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 14 నుంచి జులై 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు చెప్పారు. అపరాధ రుసుముతో జులై 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 20 నుంచి వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

6న ఏపీ ఐసెట్‌... ఏపీలో 111, తెలంగాణలో 2 పరీక్ష కేంద్రాలు

అనంతపురం (ఎస్కేయూ), న్యూస్‌టుడే: ఏపీలో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు సంబంధించిన ఏపీ ఐసెట్‌-2024ను ఈ నెల 6న నిర్వహిస్తున్నట్లు సెట్‌ ఛైర్మన్‌, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఉపకుపతి(వీసీ) హుస్సేన్‌రెడ్డి తెలిపారు. ఈ పరీక్షకు మొత్తం 48,828 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఏపీలో 111, తెలంగాణలో 2 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని