నిమ్స్‌ డైరెక్టర్‌ బీరప్పకు ఎఫ్‌ఆర్‌సీఎస్‌ గౌరవం

కష్టతరమైన శస్త్రచికిత్సల విజయవంతం, పేద రోగులకు సేవలు అందించినందుకు నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌) డైరెక్టర్‌ నగరి బీరప్పకు అరుదైన గౌరవం దక్కింది.

Published : 05 May 2024 04:35 IST

నిమ్స్‌, న్యూస్‌టుడే: కష్టతరమైన శస్త్రచికిత్సల విజయవంతం, పేద రోగులకు సేవలు అందించినందుకు నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌) డైరెక్టర్‌ నగరి బీరప్పకు అరుదైన గౌరవం దక్కింది. చారిత్రక రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ అండ్‌ సర్జన్స్‌ ఆఫ్‌ గ్లాస్గో(ఆర్‌సీపీఎస్‌జీ(యూకే)) ఆయనకు ఫెలోషిప్‌ ఆఫ్‌ ద రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ సర్జన్స్‌ (ఎఫ్‌ఆర్‌సీఎస్‌) ప్రకటించింది. నిమ్స్‌ సీనియర్‌ సర్జన్‌గా, డైరెక్టర్‌గా ప్రజలకు నాణ్యమైన సేవలందించినందుకు గాను ఇది దక్కినట్లు బీరప్ప శనివారం తెలిపారు. రాయల్‌ కాలేజ్‌ ప్రెసిడెంట్‌ ఎఫ్‌ఆర్‌సీఎస్‌ వివరాలు మెయిల్‌ ద్వారా పంపించినట్లు వెల్లడించారు. ఈ ఏడాది నవంబరు/డిసెంబరులలో నిర్వహించే సదస్సులో అక్కడి కళాశాలలో ఎఫ్‌ఆర్‌సీఎస్‌ ప్రదానం చేయనున్నట్లు వివరించారు. బీరప్పకు ఫెలోషిప్‌ రావడంపై ఆస్పత్రి వైద్యులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఆయన ఇప్పటికే రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ ఎఫ్‌ఆర్‌సీఎస్‌, అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ సర్జన్స్‌ ఎఫ్‌ఏసీఎస్‌ కలిగి ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని