7న మేడిగడ్డకు జ్యుడిషియల్‌ విచారణ కమిటీ

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలపై రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్‌ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఈ నెల 7న విశ్రాంత జడ్జి పినాకి చంద్రఘోష్‌ జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు.

Updated : 05 May 2024 05:30 IST

కాళేశ్వరం, న్యూస్‌టుడే: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలపై రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్‌ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఈ నెల 7న విశ్రాంత జడ్జి పినాకి చంద్రఘోష్‌ జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ వద్ద సీపేజీ(బుంగలు) ఏర్పడటంతో మూడు బ్యారేజీలను సందర్శిస్తారని అధికారులు అంచనా వేశారు. అయితే 7న కేవలం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నట్లు షెడ్యూల్‌ వెలువడింది. అన్నారం బ్యారేజీని విచారణ నుంచి మినహాయించినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని