Telangana Elections: అప్పటి ఓటరు కార్డు ఎట్లుండెనంటే...!

‘‘మొదట్ల ఓటేయాలంటే ఒక చిన్న చీటీ మీద పేరు రాసిచ్చెటోళ్లు. అదుంటెనే పోలింగ్‌ బూత్‌లకి పోనిచ్చెటోళ్లు. 1988 సంవత్సరంల ఎన్నికల సంఘపోళ్లు ఓటరు కార్డును ఇచ్చిండ్రు.

Updated : 29 Oct 2023 09:12 IST

‘‘మొదట్ల ఓటేయాలంటే ఒక చిన్న చీటీ మీద పేరు రాసిచ్చెటోళ్లు. అదుంటెనే పోలింగ్‌ బూత్‌లకి పోనిచ్చెటోళ్లు. 1988 సంవత్సరంల ఎన్నికల సంఘపోళ్లు ఓటరు కార్డును ఇచ్చిండ్రు. మేం కామారెడ్డిల ఉన్నప్పుడు కొందరు సార్లు మా ఇంటికచ్చి పలక మీద నంబరు, నా పేరు రాసినంక... దాన్ని పట్టుకుంటే ఒక ఫొటో తీసుకున్నరు. మళ్లా నాలుగైదు నెలలకు మా ఇంటికచ్చి పుస్తకం అసోంటి ఓటరు కార్డును ఇచ్చిండ్రు. మేం నిజాంబాదు అచ్చినంక 2018ల ఇంకో కార్డు ఇచ్చిండ్రు. ఈ యాడాది కొత్త కార్డు అచ్చింది. ఇట్లొచ్చిన కార్డులన్నీ దాసుకున్న’’ అంటూ నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం పరిధి ఓటరు రాధ(75) వివరించారు.

 ఈనాడు, నిజామాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని