ఏటా 80 వేల కొత్త రక్త క్యాన్సర్ల నిర్ధరణ

దేశంలో ఏటా 80 వేల కొత్త రక్త క్యాన్సర్లు నిర్ధరణ అవుతున్నాయని కోల్‌కతాలోని టాటా మెడికల్‌ సెంటర్‌ మాజీ డైరెక్టర్‌, ప్రొఫెసర్‌ డాక్టర్‌ మమెన్‌ చాందీ చెప్పారు.

Updated : 10 Dec 2023 06:06 IST

యశోదలో ట్రాన్స్‌ప్లాంట్‌ సెంటర్‌ ప్రారంభోత్సవంలో డా.మమెన్‌ చాందీ

మాదాపూర్‌, న్యూస్‌టుడే: దేశంలో ఏటా 80 వేల కొత్త రక్త క్యాన్సర్లు నిర్ధరణ అవుతున్నాయని కోల్‌కతాలోని టాటా మెడికల్‌ సెంటర్‌ మాజీ డైరెక్టర్‌, ప్రొఫెసర్‌ డాక్టర్‌ మమెన్‌ చాందీ చెప్పారు. శనివారం హైదరాబాద్‌ హైటెక్‌ సిటీలోని యశోద ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన బోన్‌మ్యారో అండ్‌ స్టెమ్‌ సెల్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సెంటర్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. అమెరికాలాంటి దేశాల్లో ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు దాదాపు రెండున్నర లక్షల డాలర్ల ఖర్చవుతుంటే.. భారత్‌లో రూ.25 లక్షలకు పూర్తవుతున్నట్లు చెప్పారు. రక్త క్యాన్సర్‌లో కీలకమైన బోన్‌మ్యారో చికిత్సను అందించేందుకు యశోద ఆసుపత్రిలో అధునాతన కేంద్రాన్ని ఏర్పాటుచేయడం అభినందనీయమన్నారు. యశోద ఆసుపత్రి మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జీఎస్‌ రావు మాట్లాడుతూ.. బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు అత్యాధునిక సదుపాయాలతో ఈ కేంద్రాన్ని ఏర్పాటుచేశామని, 16 పడకల సామర్థ్యంతో కూడిన ఈ కేంద్రంలో నిపుణులైన వైద్యులు, సుశిక్షితులైన వైద్య సిబ్బంది సేవలందిస్తారని తెలిపారు. యశోద హాస్పిటల్స్‌ హిమటో-ఆంకాలజిస్ట్‌ డాక్టర్‌ గణేష్‌ జైషెట్వార్‌, ముంబయిలోని ఏటీఆర్‌ఈసీటీ హాస్పిటల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ నవీన్‌ ఖత్రీ, యశోద హాస్పిటల్స్‌ డైరెక్టర్‌ పవన్‌ గోరుకంటి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని