కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం.. 37 మంది కాంగ్రెస్‌ నేతలకు పదవులు

కాంగ్రెస్‌ నేతలు ఎదురుచూస్తున్న నామినేటెడ్‌ పదవులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. మొత్తం 37 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ఈ నెల 14వ తేదీనే ప్రభుత్వ ఉత్తర్వులు జారీచేసింది.

Updated : 17 Mar 2024 07:25 IST

14వ తేదీనే ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం

ఈనాడు, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నేతలు ఎదురుచూస్తున్న నామినేటెడ్‌ పదవులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. మొత్తం 37 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ఈ నెల 14వ తేదీనే ప్రభుత్వ ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీలో చాలామంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. నామినేటెడ్‌ పదవుల జాబితాలో పార్టీలో చురుగ్గా పనిచేసి సేవలందించిన వారిని సీఎం రేవంత్‌రెడ్డి ఈ పదవులకు ఎంపిక చేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయానికి కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపునిస్తూ పదవులిచ్చారు. త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో వీరు మరింత ఉత్సాహంగా పనిచేయడానికి పదవుల భర్తీ ఉపకరిస్తుందని పార్టీ భావిస్తోంది. కొందరు నేతలు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్లు ఆశిస్తున్నారు. టికెట్‌ ఇవ్వలేకపోయినవారికి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవులతో సర్దుబాటు చేశారు. కార్పొరేషన్‌ ఛైర్మన్ల వివరాలు ఇవి...

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని