భానుడి భగభగ.. ‘ఆరెంజ్‌’ హెచ్చరికల జారీ

రాష్ట్రంలో కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా... మంగళవారం మరింత అధికమయ్యాయి. ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్‌ జిల్లాలో నమోదయ్యాయి.

Updated : 27 Mar 2024 08:55 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా... మంగళవారం మరింత అధికమయ్యాయి. ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్‌ జిల్లాలో నమోదయ్యాయి. మంగళవారం తలమడుగు, జైనథ్‌ మండలాల్లో గరిష్ఠంగా 42.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డవగా... బేల మండలం చప్రాలలో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా ఆసిఫాబాద్‌లో 42 డిగ్రీలు నమోదయింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాల్లో 40.8 డిగ్రీల నుంచి 42.3 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న మూడు రోజులు కూడా సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణశాఖ చెబుతోంది. రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళికా సంస్థ ఎండల పెరుగుదలపై ప్రజలను అప్రమత్తం చేస్తూ ‘ఆరెంజ్‌’ హెచ్చరికలను జారీచేసింది. ఆరుబయట పనిచేసే వారు, మధ్యాహ్నం పూట ప్రయాణాలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని