TS News: ఊరికి ఉపకారం.. రూ.4.50 కోట్లతో భూగర్భ మురుగు కాలువలు

ఉన్నత స్థానంలో స్థిరపడగానే..పుట్టిన ఊరిని మరిచిపోతున్న వారెందరో. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం జనగామ గ్రామానికి చెందిన తిమ్మయ్యగారి వేణుగోపాల్‌రెడ్డి అందుకు భిన్నం. హైదరాబాద్‌లో భవన నిర్మాణ రంగంలో స్థిరపడిన ఆయన.. స్వగ్రామంలోనూ మెట్రో నగరాలకు మల్లే సౌకర్యాలు కల్పించాలని సంకల్పించారు

Updated : 12 Oct 2021 07:27 IST

గతేడు రూ.78 లక్షలతో పాఠశాల భవన నిర్మాణం
స్థిరాస్తి వ్యాపారి స్ఫూర్తి

ఉన్నత స్థానంలో స్థిరపడగానే..పుట్టిన ఊరిని మరిచిపోతున్న వారెందరో. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం జనగామ గ్రామానికి చెందిన తిమ్మయ్యగారి వేణుగోపాల్‌రెడ్డి అందుకు భిన్నం. హైదరాబాద్‌లో భవన నిర్మాణ రంగంలో స్థిరపడిన ఆయన.. స్వగ్రామంలోనూ మెట్రో నగరాలకు మల్లే సౌకర్యాలు కల్పించాలని సంకల్పించారు. సుమారు రూ.4.50 కోట్లు వెచ్చించి 6.5 కి.మీ.ల మేర భూగర్భ మురుగు కాలువలు నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు సర్పంచి పాత రాజు ఆధ్వర్యంలో సోమవారం పనులు ప్రారంభించారు. తాను చదివిన ప్రాథమిక పాఠశాల గతేడాది కురిసిన వర్షాలకు కూలిపోయిందని స్థానికుల ద్వారా తెలుసుకుని రూ.78 లక్షల వ్యయంతో 8 గదులతో భవనం సిద్ధం చేయించారు. ప్రస్తుతం అక్కడే తరగతులు జరుగుతున్నాయి. ‘‘వేణుగోపాల్‌రెడ్డి గ్రామంలో 120 మంది పేదలకు గతంలో మరుగుదొడ్లు నిర్మించి ఇచ్చారని, రూ.35 లక్షలతో ఎనిమిది పడకలతో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం నిర్మించేందుకు తాజాగా అంగీకరించారని’ సర్పంచి తెలిపారు.

- న్యూస్‌టుడే, బీబీపేట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని