Baby Shark Dance: వెయ్యి కోట్లకుపైగా వ్యూస్‌వీడియో.. యూట్యూబ్‌ చరిత్రలోనే సరికొత్త రికార్డు

పది కోట్లు కాదు.. వంద కోట్లు కాదు.. ఏకంగా వెయ్యి కోట్లకుపైగా వ్యూస్‌ సాధించి యూట్యూబ్‌ చరిత్రలోనే సరికొత్త రికార్డు నెలకొల్పిందో వీడియో. అయితే, అదేదో పాప్‌ సాంగో.. వైరల్‌ వీడియోనో అనుకుంటే పొరపాటే! చిన్నారులకు సంబంధించిన ఓ పాట ఈ ఫీట్‌ సాధించడం...

Published : 16 Jan 2022 03:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పది కోట్లు కాదు.. వంద కోట్లు కాదు.. ఏకంగా వెయ్యి కోట్లకుపైగా వ్యూస్‌ సాధించి యూట్యూబ్‌ చరిత్రలోనే సరికొత్త రికార్డు నెలకొల్పిందో వీడియో. అయితే, అదేదో పాప్‌ సాంగో.. వైరల్‌ వీడియోనో అనుకుంటే పొరపాటే! చిన్నారులకు సంబంధించిన ఓ పాట ఈ ఫీట్‌ సాధించడం గమనార్హం. ‘పింక్‌ఫాంగ్’ యూట్యూబ్‌ ఛానల్‌కు చెందిన ‘బేబీ షార్క్ డ్యాన్స్‌’ వీడియో వ్యూస్‌ తాజాగా వెయ్యి కోట్లు దాటాయి. ఈ ప్లాట్‌ఫాంపై ఇలాంటి రికార్డు సాధించిన తొలి వీడియో ఇదే. అత్యధిక వ్యూస్‌ కలిగిన వీడియో కూడా ఇదే. 2016 జూన్‌లో దీన్ని అప్‌లోడ్‌ చేశారు. రెండో స్థానంలో 700 కోట్లకుపైగా వ్యూస్‌తో ప్యూర్టోరికన్ పాప్‌ స్టార్‌ లూయిస్ ఫోన్సీ సాంగ్‌ ‘డెస్పాసిటో’ ఉంది.

'బేబీ షార్క్ డ్యాన్స్' వీడియోలో.. ఇద్దరు చిన్నారులు బేబీ షార్క్ పాటకు అనుగుణంగా డ్యాన్స్‌ చేస్తున్నట్లు కనిపిస్తారు. అలాగే, బ్యాక్‌గ్రౌండ్‌లో యానిమేటెడ్ సొర చేపలు కదులుతుంటాయి. ఈ వీడియో వెయ్యి కోట్ల వ్యూస్‌ రికార్డు సాధించడంపై పింక్‌ఫాంగ్ సీఈవో మిన్ సియోక్ కిమ్ హర్షం వ్యక్తం చేశారు. మా బేబీ షార్క్.. మరో మైలురాయిని అందుకోవడం సంతోషకరమని ఒక ప్రకటనలో తెలిపారు. 2020 నవంబరులో తొలిసారి 700 కోట్ల వ్యూస్‌తో ఈ వీడియో యూట్యూబ్‌లో మొదటి స్థానంలో నిలిచింది. ఈ పాటను 2015లో కొరియన్-అమెరికన్ సింగర్‌ హోప్ సెగోయిన్ పాడారు. బేబీ షార్క్ ఆధారంగా ఒక ఫీచర్ ఫిల్మ్ కూడా రూపొందుతుండటం విశేషం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు