China: తైవాన్‌ దిశగా చైనా సాయుధ దండు..!

తైవాన్‌ సరిహద్దుల్లో చైనాలో మరోసారి ఉద్రిక్తతలకు ఆజ్యం పోస్తోంది. 

Published : 12 Jul 2023 14:51 IST

ఇంటర్నెట్‌డెస్క్: తైవాన్‌ (Taiwan)ను భయపెట్టేందుకు చైనా (China) ప్రయత్నాలను తీవ్రం చేసింది. తాజాగా భారీ సంఖ్యలో యుద్ధనౌకలు, ఫైటర్‌జెట్‌, ఇతర విమానాలను తైవాన్‌ దిశగా పంపింది. ఈ విషయాన్ని తైవాన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. మంగళవారం నుంచి బుధవారం ఉదయం లోపు ఏకంగా పీఎల్‌ఏకు చెందిన 38 విమానాలు, 9 నౌకలు తైవాన్‌ దిశగా వచ్చాయి. ఇక బుధవారం ఉదయం నుంచి దాదాపు 30 యుద్ధ విమానాలు వచ్చినట్లు వివరించారు. వీటిల్లో జే-10, జే-16 రకం ఫైటర్లు ఉన్నాయి. 

మరోవైపు చైనాకు చెందిన హెచ్‌-6 భారీ బాంబర్లు కూడా తైవాన్‌ సమీపంలో ఎగిరినట్లు సమాచారం. వీటిల్లో 32 విమానాలు తైవాన్‌ జలసంధిలోని మిడ్‌లైన్‌ను దాటాయి.  ఈ లైన్‌ను ఇరు దేశాల మధ్య అనధికారిక సరిహద్దుగా భావిస్తారు. బుధవారం మధ్యాహ్నాం దాటాక మరో 23 విమానాలు వచ్చినట్లు తైవాన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. తైవాన్‌ నిర్వహించనున్న హాన్‌ గాంగ్‌ వార్షిక సైనిక విన్యాసాల ముందు చైనా ఈ చొరబాట్లకు ప్రయత్నించింది.

ఏప్రిల్‌లో కూడా తైవాన్‌ సరిహద్దు ప్రాంతాల్లో చైనా భారీగా యుద్ధ నౌకలను, డజన్ల కొద్దీ ఫైటర్‌ జెట్లను మోహరించింది. యుద్ధానికి రిహార్సల్స్‌గా దీనిని అభివర్ణించింది.  అప్పట్లో షిప్పింగ్‌, ఎయిర్‌లైన్స్‌ విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అమెరికా హౌస్‌ స్పీకర్‌ మెక్‌కార్థీతో  తైవాన్‌ అధ్యక్షురాలు త్సాయ్‌ ఇంగ్‌వెన్‌ సమావేశమైనందుకు ప్రతీకారంగానే చైనా ఈ చర్యలకు పాల్పడినట్లు ఆరోపించింది. నాడు తైవాన్‌ సరిహద్దు ప్రాంతాల్లో చైనా 8 యుద్ధనౌకలతోపాటు, 42 ఫైటర్‌జట్‌ విమానాలను మోహరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని