కొవిడ్‌ సంబంధ ఆందోళనలతో పగటి కలలపై ప్రభావం

కొవిడ్‌-19 మహమ్మారి గురించి ప్రజలు ఎక్కువగా ఆందోళన చెందిన రోజుల్లో వారి పగటి కలలపై ప్రభావం పడినట్లు పరిశోధకులు తేల్చారు.

Published : 01 Jul 2023 23:47 IST

దిల్లీ: కొవిడ్‌-19 మహమ్మారి గురించి ప్రజలు ఎక్కువగా ఆందోళన చెందిన రోజుల్లో వారి పగటి కలలపై ప్రభావం పడినట్లు పరిశోధకులు తేల్చారు. వాటిలో ప్రతికూల భావోద్వేగాలు ఎక్కువగా ఉత్పన్నమైనట్లు వివరించారు. వారికి చెడు కలలు వస్తున్నట్లు తెలిపారు. ఫిన్లాండ్‌, బ్రిటన్‌, ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. ఇందుకోసం వంద మంది వాలంటీర్లను ఎంపిక చేసుకున్నారు. కొవిడ్‌ గురించి వారు ఎంత ఆందోళన చెందారన్నది వారిని ప్రశ్నించి తెలుసుకున్నారు. పగటి సమయంలో వారికి వచ్చిన కలల గురించి సాయంత్రం వేళ ప్రశ్నించి, నమోదు చేశారు. రాత్రి కలలపై ఉదయాన్నే వివరాలు తీసుకున్నారు. మొత్తం మీద 3వేలకుపైగా కలలు వచ్చినట్లు వాలంటీర్లు పేర్కొన్నారు. వాటికి సంబంధించిన అనుభవాలను పరిశోధకులకు వివరించారు. వీటిని విశ్లేషించిన శాస్త్రవేత్తలు.. పగటి సమయంలో వచ్చిన కలల భావోద్వేగ నాణ్యతను కొవిడ్‌ సంబంధ ఆందోళనలు ప్రభావితం చేశాయని తేల్చారు. ప్రజల అంతర్గత అనుభవాలను ఈ మహమ్మారి తీర్చిదిద్దిన తీరును ఇది ఆవిష్కరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని