Birth Control: పురుషులకు సంతానోత్పత్తి నిరోధక మాత్ర!

మగ ఎలుకల్లో వీర్యకణాల విడుదలను తాత్కాలికంగా అడ్డుకోవడం ద్వారా ఆడ ఎలుకల్లో గర్భధారణను నిరోధించగల రసాయనాన్ని అమెరికాలోని వెయిల్‌ కార్నెల్‌ మెడిసిన్‌ సంస్థ పరిశోధకులు రూపొందించారు.

Published : 16 Feb 2023 07:10 IST

వాషింగ్టన్‌: మగ ఎలుకల్లో వీర్యకణాల విడుదలను తాత్కాలికంగా అడ్డుకోవడం ద్వారా ఆడ ఎలుకల్లో గర్భధారణను నిరోధించగల రసాయనాన్ని అమెరికాలోని వెయిల్‌ కార్నెల్‌ మెడిసిన్‌ సంస్థ పరిశోధకులు రూపొందించారు. ఆ రసాయన మాత్ర పేరు టీడీఐ-11861. గర్భం నివారణ కోసం ప్రస్తుతం పురుషులకు కండోమ్‌లు, వేసెక్టమీ శస్త్రచికిత్స వంటివి అందుబాటులో ఉన్నాయి. ఎలుకల మీద ప్రస్తుత ప్రయోగాలు విజయవంతంగా పూర్తయితే మగవాళ్లకూ సంతానోత్పత్తి నిరోధక మాత్రలు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. టీడీఐ-11861 మాత్రను మగ ఎలుకలకు ఇచ్చినప్పుడు వాటి వీర్యకణాలు రెండున్నర గంటలసేపు స్తంభించిపోయాయి. ఆడ ఎలుకల్లో ప్రవేశించిన మూడు గంటల తరవాత కొన్ని వీర్యకణాలు కొంతమేరకు తిరిగి క్రియాశీలమయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని