ఐఎంఎఫ్‌ రుణ ప్యాకేజీ పునరుద్ధరణకు పాక్‌ ఆసక్తి

పాకిస్థాన్‌ ఆర్థికవ్యవస్థ కోలుకునేందుకు  అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) నుంచి రుణ సేకరణ కోసం గతంలో చేసుకొన్న ఒప్పందం పునరుద్ధరణకు పాక్‌ ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. ఈ ఒప్పందం గడువు దాదాపు ముగింపునకు వచ్చింది.

Published : 02 Jun 2023 04:49 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ ఆర్థికవ్యవస్థ కోలుకునేందుకు  అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) నుంచి రుణ సేకరణ కోసం గతంలో చేసుకొన్న ఒప్పందం పునరుద్ధరణకు పాక్‌ ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. ఈ ఒప్పందం గడువు దాదాపు ముగింపునకు వచ్చింది. ఐఎంఎఫ్‌ చీఫ్‌ క్రిస్టాలినా జార్జివాతో ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ గత శనివారం ఫోను ద్వారా జరిపిన చర్చల్లో పునరుద్ధరణ విషయాన్ని ప్రస్తావించారు. ప్రపంచ దేశాలకు రుణదాతగా ఉన్న ఆ సంస్థ నుంచి పాక్‌కు ఉద్దీపన ప్యాకేజీ కోసం కొనసాగుతున్న ప్రయత్నాలు ఫలించే అవకాశాలు తక్కువేనని స్థానిక మీడియా కథనాలు గురువారం వెల్లడించాయి. 2019 ప్రారంభంలో సంతకం చేసిన ఒప్పందం ప్రకారం 6.5 బిలియన్‌ డాలర్ల రుణసాయాన్ని పునరుద్ధరించాలని క్రిస్టాలినాను షరీఫ్‌ కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని