Covid 19: కొవిడ్‌తో మూగబోయిన గొంతు

కొవిడ్‌ 19 సోకడం వల్ల 15 ఏళ్ల బాలికకు మాట పడిపోయిన ఉదంతం అమెరికాలో వెలుగు చూసింది. కొవిడ్‌కు కారణమైన సార్స్‌కోవ్‌ 2 వైరస్‌ నాడీ మండలాన్ని దెబ్బతీస్తుందనడానికి ఇది సంకేతమని మెసాచుసెట్స్‌ కన్ను, చెవి ఆస్పత్రి వైద్యులు చెప్పారు. 15 ఏళ్ళ బాలిక కొవిడ్‌ 19 సోకిన 13 వారాలకు శ్వాస సమస్యతో ఆస్పత్రిలో చేరింది.

Updated : 21 Dec 2023 09:13 IST

దిల్లీ: కొవిడ్‌ 19 సోకడం వల్ల 15 ఏళ్ల బాలికకు మాట పడిపోయిన ఉదంతం అమెరికాలో వెలుగు చూసింది. కొవిడ్‌కు కారణమైన సార్స్‌కోవ్‌ 2 వైరస్‌ నాడీ మండలాన్ని దెబ్బతీస్తుందనడానికి ఇది సంకేతమని మెసాచుసెట్స్‌ కన్ను, చెవి ఆస్పత్రి వైద్యులు చెప్పారు. 15 ఏళ్ళ బాలిక కొవిడ్‌ 19 సోకిన 13 వారాలకు శ్వాస సమస్యతో ఆస్పత్రిలో చేరింది. పరీక్షలు చేశాక ఆమె స్వరపేటికలో రెండు స్వర తంత్రులూ నిస్తేజమై గొంతు సంబంధ పక్షవాతం వచ్చినట్లు కనుగొన్నారు. ఆమె గొంతుకు వైద్యులు శస్త్రచికిత్సతో రంధ్రం చేసి గొట్టం పెట్టి ఊపిరి ఆడేట్లు చేశారు. ఇలా గొంతులో గొట్టం ద్వారా శ్వాస తీసుకోవలసిన పరిస్థితి 13 నెలలపాటు కొనసాగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని