Hezbollah: హెజ్‌బొల్లా ప్రతీకార దాడులు.. ఇజ్రాయెల్‌పై 60కిపైగా రాకెట్లు!

ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా ప్రతీకార దాడులకు దిగింది. ‘మౌంట్ మెరోన్‌’పై ఉన్న గగనతల నిఘా స్థావరం వైపు 62 రాకెట్లను ప్రయోగించింది.

Updated : 06 Jan 2024 16:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇజ్రాయెల్‌ (Israel)పై లెబనాన్‌ తీవ్రవాద దళం హెజ్‌బొల్లా (Hezbollah) ప్రతీకార దాడులకు దిగింది. శనివారం 60కిపైగా రాకెట్లతో విరుచుకుపడింది. ‘మౌంట్ మెరోన్‌’పై ఉన్న గగనతల నిఘా స్థావరం వైపు 62 రాకెట్లను ప్రయోగించామని, అవి నేరుగా లక్ష్యాన్ని తాకాయని వెల్లడించింది. బీరుట్‌ సమీప ప్రాంతంలో సీనియర్‌ హమాస్‌ నేతను హతమార్చిన ఘటనపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించిన మరుసటి రోజే ఈ దాడులు నిర్వహించింది. ఇది కేవలం ప్రారంభమేనని పేర్కొంది.

వీళ్ల దగ్గర లక్షకు పైగా రాకెట్లున్నాయి.. ఇజ్రాయెల్‌కు ‘హెజ్‌బొల్లా’ సవాల్‌!

ఇజ్రాయెల్‌ జరిపినట్లుగా భావిస్తున్న ఇటీవలి దాడిలో హమాస్‌ డిప్యూటీ రాజకీయ నేత సలేహ్‌ అరౌరి హతమైన విషయం తెలిసిందే. దీనికి గట్టి బదులు ఇవ్వని పక్షంలో లెబనాన్ మొత్తం ఇజ్రాయెల్ దాడులకు గురవుతుందని ఉగ్రసంస్థ నాయకుడు హసన్‌ నస్రల్లా శుక్రవారం పేర్కొన్నాడు. హెజ్‌బొల్లా దాడులను టెల్‌ అవీవ్‌ ధ్రువీకరించింది. రాకెట్లు ప్రయోగించిన ఉగ్రవాదులపై ఎదురుదాడి చేపట్టినట్లు వెల్లడించింది. ఇరువైపులా ప్రాణనష్టం వివరాలు తెలియరాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు