NASA: అంతరిక్షంలో చనిపోతే.. భూమికి ఎలా తీసుకొస్తారో తెలుసా..!

అంతరిక్షం (space)లో అడుగుపెట్టడమంటే పెద్ద సాహసమే. పైగా ఇది  ప్రాణాలకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. మరి.. మార్గమధ్యలో మరణిస్తే.. మృతదేహాన్ని భూమిపైకి ఎలా తీసుకువస్తారో తెలుసా..?

Published : 03 Aug 2023 01:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అంతరిక్షం (space)లో అడుగుపెట్టడమంటే పెద్ద సాహసమే. సుదీర్ఘకాలం శిక్షణ తరువాత అంతరిక్షంలోకి ప్రయాణిస్తారు. అంతరిక్షంలోని ఎన్నో రహస్యాలు,  ఇతర గ్రహాలపై జీవుల మనుగడ తదితర అంశాలపై అన్వేషణ 60 ఏళ్ల క్రితమే ప్రారంభమైంది. ఈ ప్రయాణాల్లో ఇప్పటివరకు 20 మంది వ్యోమగాములు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం అంతరిక్ష యాత్రలు సర్వసాధారణంగా మారాయి.

భవిష్యత్తులో ఇతర గ్రహాలపై సెలవులను ఆస్వాదించే రోజులు కూడా రానున్నాయి. నాసా 2025 నాటికి చంద్రుడి పైకి తమ సిబ్బందిని పంపించేందుకు యోచిస్తోంది. దశాబ్ద కాలంలో అంగారకుడిపైకి వ్యోమగాములను పంపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయితే, మార్గమధ్యలో ఎవరైనా చనిపోతే..? వారిని భూమికి ఎలా తీసుకొస్తారు..? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు నాసా ప్రోటోకాల్‌ ఏం చెబుతోందంటే..

అంగారకుడు, చంద్రుడిపై చనిపోతే..?

వాయేజర్‌-2 నుంచి అందుతున్న సంకేతాలు!

అంతరిక్షంలోకి ప్రయాణం ప్రారంభమయ్యాక భూమికి దగ్గరగా ఉన్న కక్ష్యలో ఎవరైనా వ్యోమగాములు మరణిస్తే.. సిబ్బంది మృతదేహాన్ని స్పేస్‌ కాప్య్సూల్‌ ద్వారా భూమికి తిరిగి తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. దానిలో మృతదేహాన్ని భద్రపరిచేందుకు ప్రత్యేక గది ఉంటుంది. శరీరానికి కావాల్సిన స్థిరమైన ఉష్ణోగ్రత ఉంటుంది. అయితే, అంతరిక్ష కేంద్రం లేదా అంతరిక్ష నౌక, భూమికి దగ్గరగా ఉన్న కక్ష్యల్లో మరణం సంభవిస్తే రోజుల వ్యవధిలో శరీరాన్ని తీసుకురాగలిగే వీలు ఉంటుంది. చంద్రుడిపై మరణం సంభవిస్తే మృతదేహాన్ని భూమి మీదకు తీసుకు వచ్చేందుకు కొన్ని రోజులు పడుతుంది. ఒక వేళ అంగారక గ్రహా యాత్రలో చనిపోతే.. మృతదేహాన్ని వెనక్కి తీసుకురాలేరు. ఆ మిషన్‌ పూర్తి అయ్యే వరకు వేచి చూడాల్సిందే. అంటే దేహాన్ని తీసుకువచ్చేందుకు కొన్ని ఏళ్లు కూడా పట్టే అవకాశం ఉంటుందని శాస్ర్తవేత్తలు వెల్లడించారు.

స్పేస్‌సూట్‌ లేకుండా అంతరిక్షంలో అడుగు పెడితే..

వ్యోమగామి స్పేస్‌సూట్‌ లేకుండా అంతరిక్షంలో అడుగుపెడితే తక్షణమే ప్రాణాలు కోల్పోతాడు.ఆక్సిజన్‌ లేకపోవడంతో మనిషి పీడనం కోల్పోతాడు. అంతేకాకుండా రక్తంలో వేడి పెరిగిపోతుంది. దీంతో కొద్ది క్షణాల్లోనే మరణం సంభవిస్తుంది.

ల్యాండ్‌ అయ్యాక మరణిస్తే..

భూమిపై శరీరాన్ని ఖననం చేస్తే.. కీటకాలు మృతదేహాన్ని కుళ్లింపజేస్తాయి. కానీ.. అంగారకుడి ఉపరితలంపై ల్యాండ్‌ అయ్యాక మరణిస్తే.. అప్పుడు ఏం జరుగుతుందంటే.. శరీరంలోని బాక్టీరియా వల్ల గ్రహ ఉపరితలం కలుషితమౌతుంది. అలాంటి సమయంలో మృతదేహాన్ని భూమికి తీసుకొచ్చేంత వరకు ప్రత్యేకమైన బాడీ బ్యాగ్‌లో భద్రపరచాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని