Maldives: ఆంక్షల సడలింపు.. మాల్దీవులకు బియ్యం, చక్కెర ఎగుమతికి భారత్‌ గ్రీన్‌సిగ్నల్‌

మాల్దీవుల(Maldives)కు నిత్యావసర వస్తువులైన బియ్యం, చక్కెర, ఉల్లిపాయలు, గోధుమపిండి తదితర వస్తువులను ఎగుమతి చేసేందుకు భారత్‌ సిద్ధమైంది.

Published : 06 Apr 2024 00:11 IST

దిల్లీ: మాల్దీవుల నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మహమ్మద్‌ ముయిజ్జు.. మొదటినుంచి భారత్‌పై వ్యతిరేక వైఖరి అవలంబిస్తోన్న విషయం తెలిసిందే. దీంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయినప్పటికీ ద్వైపాక్షిక ఒప్పందాలను భారత్‌ గౌరవిస్తోంది. ఈక్రమంలో మాల్దీవుల(Maldives)కు నిత్యావసర వస్తువుల ఎగుమతిపై ఉన్న ఆంక్షలను తొలగించింది. బియ్యం, చక్కెర, ఉల్లిపాయలు, గోధుమపిండి వంటి వస్తువులను నిర్దిష్ట స్థాయిలో ఎగుమతి చేసేందుకు సిద్ధమైంది.

లోక్‌సభ ఎన్నికల ముందు స్థానికంగా పెరుగుతోన్న నిత్యావసర ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులోభాగంగా బియ్యం, చక్కెర, ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది.  ఈక్రమంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇరుదేశాల మధ్య జరిగిన ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా వీటి ఎగుమతులపై మినహాయింపు ఇస్తున్నట్లు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారెన్‌ ట్రేడ్‌ (DGFT) తెలిపింది.

Toxic Letters: పాకిస్థాన్‌ కోర్టుల్లో ‘విషపు లేఖల’ కలకలం..!

మాల్దీవులకు 1,24,218 మెట్రిక్‌ టన్నుల బియ్యం, 1,09,162 టన్నుల గోధుమ పిండి, 64,494 టన్నుల చక్కెర, 21,513 టన్నుల బంగాళదుంప, 35,749 టన్నుల ఉల్లి, 42.75 కోట్ల కోడిగుడ్లు ఎగుమతి చేసేందుకు భారత్‌ అనుమతించింది. వీటితోపాటు 10లక్షల టన్నుల కంకర, ఇసుక కూడా ఎగుమతి చేయనుంది. ఇదిలాఉంటే, చైనా అనుకూల పంథాను అనుసరిస్తోన్న మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు.. భారత్‌తో కఠినంగా వ్యవహరిస్తున్నారు. తమ భూభాగం నుంచి భారత సైనిక దళాలు వెళ్లిపోవాలంటూ మొదట్లో హెచ్చరించడం ఇరుదేశాల సంబంధాలపై ప్రభావం చూపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని