India China: చైనా టార్చ్‌బేరర్‌ వివాదం.. భారత్‌ దీటైన నిర్ణయం!

బీజింగ్‌ వింటర్ ఒలింపిక్స్‌లో టార్చ్‌బేరర్‌గా గల్వాన్‌ ఘర్షణలో గాయపడిన ఆర్మీ అధికారిని ఎంపిక చేస్తూ చైనా తీసుకున్న నిర్ణయంపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. వింటర్‌ ఒలింపిక్స్‌ను రాజకీయాలకు వేదికగా ఎంచుకోవడం విచారకరమని పేర్కొంది. ఈ క్రమంలో బీజింగ్...

Published : 04 Feb 2022 02:17 IST

దిల్లీ: బీజింగ్‌ వింటర్ ఒలింపిక్స్‌లో టార్చ్‌బేరర్‌గా గల్వాన్‌ ఘర్షణలో గాయపడిన ఆర్మీ అధికారిని ఎంపిక చేస్తూ చైనా తీసుకున్న నిర్ణయంపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. వింటర్‌ ఒలింపిక్స్‌ను రాజకీయాలకు వేదికగా ఎంచుకోవడం విచారకరమని పేర్కొంది. ఈ క్రమంలో బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ ప్రారంభ, ముగింపు వేడుకల్లో చైనాలోని భారత రాయబారి పాల్గొనరని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి గురువారం వెల్లడించారు. మరోవైపు.. ఈ విశ్వక్రీడల ప్రారంభ, ముగింపు వేడుకలను ‘దూరదర్శన్’ ప్రసారం చేయబోదని ప్రసార భారతి సీఈవో శశి శేఖర్ వెంపటి ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్‌ చేశారు.

2020లో భారత్‌- చైనా సరిహద్దులోని గల్వాన్‌ లోయలో ఇరుదేశాలకు చెందిన సైనికుల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇరు వర్గాలకు ప్రాణనష్టం జరిగింది. ఆ సమయంలో తీవ్రంగా గాయపడిన సైనిక కమాండర్‌ కర్నల్‌ క్వీ ఫాబోవాను చైనా.. వింటర్ ఒలింపిక్స్ టార్చ్‌ బేరర్‌గా నియమించిందని గ్లోబల్‌ టైమ్స్‌ కథనం పేర్కొంది. అంతర్జాతీయంగా చర్చనీయాంశమైన ఈ ఎంపికను అమెరికా సైతం తప్పుపట్టింది. ఈ చర్య సిగ్గు చేటు అంటూ విమర్శించింది. మరోవైపు గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణలో డ్రాగన్‌ చెప్పినదానికంటే ఎక్కువే నష్టపోయిందని తాజాగా ఓ ఆస్ట్రేలియన్‌ వార్తాసంస్థ పేర్కొన్న విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని