Wolf: రూ.20 లక్షలు పెట్టి.. తోడేలులా మారిపోయి!

జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి తోడేలులా మారిపోయాడు. ఎలా అనుకుంటున్నారా? ఓ సంస్థ ప్రత్యేకంగా రూపొందించిన కాస్ట్యూమ్‌ ధరించి అచ్చం తోడేలుగా కనిపిస్తున్నాడు.

Published : 31 Jul 2023 21:07 IST

టోక్యో: జీవితంలో ఒక్కొక్కరిది ఒక్కో కల.. ఒక్కో అభిరుచి. కానీ, జపాన్‌ (Japan)కు చెందిన ఓ టోరు ఉయెదాది మాత్రం విచిత్రమైన కోరిక. అదే ‘తోడేలు’గా మారిపోవడం. ఈ క్రమంలోనే రూ.20 లక్షలు ఖర్చు చేసి మరీ.. చిన్నప్పటినుంచి నుంచి ఉన్న తన కోరికను తీర్చుకుని సంబరపడిపోతున్నాడు. ఓ సంస్థ ప్రత్యేకంగా రూపొందించిన ‘తోడేలు కాస్ట్యూమ్‌ (Wolf Costume)’ ధరించి అచ్చంగా తోడేలుగా కనిపిస్తూ.. మురిసిపోతున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఆ అంతుచిక్కని వస్తువు.. భారత రాకెట్‌ శకలమే..!

సినిమాలు, చలనచిత్ర రంగానికి కాస్ట్యూమ్‌లు రూపొందించే ‘జెప్పెట్‌’ అనే సంస్థ ఈ తోడేలు డ్రెస్‌ను తయారు చేసింది. నలుగురు సిబ్బంది ఏడు వారాలపాటు కష్టపడి దీన్ని కుట్టినట్లు చెప్పింది. టోరో విజ్ఞప్తి మేరకు.. రెండు కాళ్లతోనే నడిచే విధంగా దీన్ని రూపొందించినట్లు తెలిపింది. ఇంట్లో వీలుచిక్కినప్పుడల్లా తోడేలు డ్రెస్‌లో దూరిపోయి.. హాయిగా విశ్రాంతి తీసుకుంటూ, బాధలన్నీ మరచిపోతున్నట్లు టోరు చెబుతున్నాడు. గతంలో ఇదే సంస్థ రూపొందించిన డ్రెస్‌తో జపాన్‌ చెందిన ఓ వ్యక్తి అచ్చూ ‘కోలీ’ జాతి శునకంలా మారిపోయాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు