పాస్టర్ మాటలు నమ్మి నిరాహార దీక్ష.. 201 మంది మృతి..!
ఆకలితో అలమటించి చనిపోతే జీసెస్‌ను కలుస్తారని తన అనుచరులకు నమ్మబలికాడో పాస్టర్. ఫలితంగా వందల మంది ఆహారం తినడం మానేసి ప్రాణాలు కోల్పోయారు.
ఇంటర్నెట్‌డెస్క్: కెన్యాలో ఓ చర్చి పెద్ద నిర్వాకం కారణంగా ఇప్పటి వరకు 200 మందికిపైగా ప్రాణాలు తీసుకొన్నారు. గత నెల నుంచి అధికారులు కెన్యాలోని షకహోలా అటవీ ప్రాంతంలో మృతదేహాలను గుర్తిస్తూనే ఉన్నారు. శనివారం ఏకంగా 22 మృతదేహాలు బయటపడ్డాయి. వీరంతా ఆహారం తీసుకోకుండా ప్రాణాలు విడిచినట్లు నిర్ధారించారు. మరో 600 మంది జాడ తెలియడం లేదు. వీరంతా ఎక్కడో రహస్య ప్రాంతంలో నిరాహారదీక్ష చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు.
2019లో పాల్ మెకంజీ అనే చర్చి పాస్టర్ ఈ అటవీ ప్రాతంలోని కిలిఫీ అనే చోట 800 ఎకరాల్లో విస్తరించిన ప్రాపర్టీలో మకాం వేశాడు. ఆహారం తినకుండా తీవ్రమైన ఆకలితో మరణిస్తే జీసెస్‌ను కలిసే అదృష్టం వస్తుందని తన అనుచరులకు ఉద్బోధించాడు. దీంతో అతడి అనుచరులు నిరాహార దీక్షలు మొదలుపెట్టారు. దీంతో డజన్ల సంఖ్యలో భక్తులు ప్రాణాలు విడిచారు. వీరందరిని ఆ ప్రాపర్టీలోనే సామూహిక ఖననాలు చేశారు. ఈ విషయం తెలుసుకొన్న కెన్యా అధికారులు దాడులు చేసి గత నెల మెకంజీని అదుపులోకి తీసుకొన్నారు. ఇక్కడి నుంచి దాదాపు 100కుపైగా మృతదేహాలను వెలికి తీసి శవపరీక్షలు నిర్వహించారు. చాలా మంది ఆహారం తినక, గొంతు నులమడం, ఆయుధాలతో దాడి వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. కొన్ని మృతదేహాల్లో శరీర భాగాలు కూడా అదృశ్యమైనట్లు కనుగొన్నారు. మెకంజీ భార్య సహా 16 మందిని అదుపులోకి తీసుకొని గత నెల కోర్టులో ప్రవేశపెట్టారు. దాదాపు 610 మంది మిస్సయినట్లు కోస్ట్ రీజియన్ కమిషనర్ రోడ వెల్లడించారు. అంతేకాదు.. అధికారులు దాడులు చేసి చాలా మంది బాధితులను విడిపించారు. వీరంతా నడవలేని స్థితిలో ఉన్నట్లు సమాచారం.
గతంలో మెకంజీ చర్చిలో చిన్నారులు మృతి చెందడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఆ తర్వాత అతడు అడవిలోకి మకాం మార్చాడు. అతడి అనుచరులు కూడా అడవిలోకి వెళుతుండటంతో స్థానికులకు అనుమానం వచ్చి అధికారులను అప్రమత్తం చేశారు. కెన్యాలో మతపరమైన ఆచారాలను బలంగా పాటించే అలవాటుంది. దీంతో దేశంలో మరెక్కడైనా ఇటువంటివి ఆచరిస్తున్నారేమో గుర్తించాలని ఆ దేశాధ్యక్షుడు విలియం రూటో ఆదేశాలు జారీ చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Andhra News: ఏపీ ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు
-
Movies News
Social Look: మాల్దీవుల్లో రకుల్‌ప్రీత్ మస్తీ.. బస్సులో ఈషారెబ్బా పోజులు
-
General News
Bhaskar Reddy: ప్రత్యేక కేటగిరీ విచారణ ఖైదీగా వైఎస్ భాస్కర్‌రెడ్డి
-
Sports News
WTC Final: తుది జట్టు అలా ఉండొద్దు.. అప్పటి పొరపాటును మళ్లీ చేయొద్దు: ఎంఎస్కే ప్రసాద్
-
General News
TTD: తిరుమల ఘాట్రోడ్లో ప్రమాదాల నివారణకు దీర్ఘకాలిక ప్రణాళికలు: ఈవో
-
India News
Elon Musk: మస్క్ తనయుడికి సందేహం.. దిల్లీ పోలీసుల రిప్లయ్!