Ukraine Crisis: సైనిక దుస్తుల్లోనే ఏకమైన ఉక్రెయిన్‌ జంట.. వీడియో వైరల్‌

ఉక్రెయిన్, రష్యా మధ్య భారీ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఓ ప్రేమ జంట సైనిక దుస్తుల్లోనే వివాహం చేసుకున్నారు........

Published : 23 Jun 2022 01:41 IST

కీవ్‌: ఉక్రెయిన్‌పై (Ukraine) రష్యా (Russia) దాడులు కొనసాగుతున్నాయి. జెలెన్‌స్కీ సేనలు శక్తిమేర అడ్డుకుంటున్నప్పటికీ.. పుతిన్‌ సైన్యం భీకర దాడులకు పాల్పడుతూ దూసుకొస్తోంది. దీంతో ఉక్రెయిన్‌ పౌరులు సైతం తమ సైన్యానికి అండగా నిలుస్తున్నారు. రేయింబవళ్లు దేశం కోసం కాపలా కాస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ ప్రేమ జంట సైనిక దుస్తుల్లోనే వివాహం (marriage) చేసుకున్నారు. ఎలాంటి ఆర్బాటాలు, ఆడంబరాలకు పోకుండా సింపుల్‌గా పెళ్లి ఉంగరాలను మార్చుకున్నారు. వధూవరులిద్దరూ చర్చి నుంచి బయటకు రాగా బంధుమిత్రులు కేరింతలు కొడుతూ నూతన వధూవరులకు స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించి ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రి పంచుకున్న ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

‘ఈరోజుల్లో ఉక్రెయిన్‌లో వివాహాలు ఇలాగే జరుగుతున్నాయి. తెల్లటి దుస్తులు లేవు. ఆర్బాటాలు అంతకంటే లేవు. కానీ వారి మనసుల నిండా ప్రేమ పుష్కలంగా ఉంది’ అంటూ మంత్రి పేర్కొన్నారు. ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు 2.79 లక్షల మంది వీక్షించారు. 18వేల మంది లైక్‌ చేశారు. అనేక మంది ఆ జంటకు కామెంట్ల రూపంలో శుభాకాంక్షలు తెలిపారు. ‘ఇప్పటివరకు ఇంత అందమైన జంటను నేను చూడలేదు’ అంటూ ఓ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని