Joe Biden: అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో బైడెన్‌కు తొలి విజయం

Joe Biden: దక్షిణ కరోలినా ప్రైమరీలో బైడెన్‌ ఘన విజయం సాధించారు. మిన్నెసొటా ప్రతినిధి డీన్‌ ఫిలిప్స్‌, రచయిత మెరియన్ విలియమ్సన్‌పై ఆయన గెలుపొందారు.

Published : 04 Feb 2024 09:20 IST

కొలంబియా: డెమోక్రటిక్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో జో బైడెన్ (Joe Biden) తొలి గెలుపు నమోదు చేశారు. దక్షిణ కరోలినా ప్రైమరీలో ఘన విజయం సాధించారు. మిన్నెసొటా ప్రతినిధి డీన్‌ ఫిలిప్స్‌, రచయిత మెరియన్ విలియమ్సన్‌పై ఆయన గెలుపొందారు. 2020లో అంచనాలను తలకిందులు చేస్తూ దక్షిణ కరోలినా ఓటర్లు తన విజయానికి బాటలు వేశారని బైడెన్‌ అన్నారు. 2024లోనూ అదే పునరావృతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌నకు ఓటమి తప్పదని అన్నారు.

దక్షిణ కరోలినాలో రిపబ్లికన్లకు మంచి పట్టుంది. ఇక్కడి ఓటర్లలో 26 శాతం నల్లజాతీయులే. దేశం మొత్తం ఓటర్లలో వీరి వాటా 11 శాతం. ఏపీ ఓట్‌క్యాస్ట్‌ సర్వే ప్రకారం.. గత ఎన్నికల్లో ప్రతి 10 మంది నల్లజాతీయుల్లో 9 మంది బైడెన్‌కు ఓటేశారని తేలింది. తాజా ప్రైమరీలోనూ బైడెన్‌ (Joe Biden) గెలుపునకు వారే కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మంగళవారం నెవాడాలో, ఫిబ్రవరి 27న మిషిగన్‌, మార్చి 5న పలు రాష్ట్రాల్లో డెమోక్రటిక్‌ పార్టీ ప్రైమరీలు జరగనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని