Rishi Sunak: ఇంగ్లాండ్ ఆటగాళ్లతో క్రికెట్ ఆడిన రిషిసునాక్.. వీడియో వైరల్
గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన ఇంగ్లాండ్ జట్టుతో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak) క్రికెట్ ఆడాడు. సామ్ కరన్, క్రిస్ జోర్డాన్ బంతులేయగా ఆయన బ్యాటింగ్ చేశారు. తదుపరి ఆయన సైతం బౌలింగ్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: గతేడాది నవంబరులో జరిగిన టీ20 ప్రపంచకప్(ICC T20 WorldCup 2022)లో ఇంగ్లాండ్ జట్టు విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఇటీవల ఆ జట్టు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్(Rishi Sunak)ను డౌనింగ్ స్ట్రీట్ 10 లోని ఆయన అధికారిక భవనంలో కలిసింది. భవనంలోని గార్డెన్‌లో ఆటగాళ్లంతా ఆయనతో సరదాగా గడిపారు. అందరూ కలిసి క్రికెట్ ఆడారు. ఆల్‌రౌండర్ సామ్‌కరన్(Sam Curran) బౌలింగ్‌కు సునాక్ బ్యాటింగ్ చేశారు. కొన్ని మంచి షాట్లు ఆడిన సునాక్ క్రిస్ జోర్డాన్(Chris Jordan) బంతికి ఔటయ్యారు. తర్వాత ఆయన సైతం ఆటగాళ్లకు బౌలింగ్ చేశారు. కెప్టెన్ జోస్ బట్లర్‌తో పాటు సామ్‌కరన్, పేసర్ క్రిస్‌జోర్డాన్, లియమ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఫిల్ సాల్ట్, క్రిస్ వోక్స్, రిచర్డ్ గ్లీసన్, టైమల్ మిల్స్ పాల్గొన్నారు. వీరంతా సరదాగా గడిపిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022లో పాకిస్థాన్‌ను ఓడించి ఇంగ్లాండ్ జట్టు విజేతగా నిలిచింది. 2010లో పాల్ కాలింగ్‌వుడ్(Paul Collingwood) నేతృత్వంలో టీ20 కప్పు గెలిచిన ఆ జట్టు తిరిగి 12 ఏళ్ల తర్వాత జోస్‌బట్లర్(Jos Buttler) సారథ్యంలో టైటిల్ నెగ్గింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Nayanthara: ఆనాడు దర్శకుడికి కోపం తెప్పించిన నయనతార.. ‘నువ్వు రావొద్దు’ అని చెప్పేసిన డైరెక్టర్
-
Crime News
Hyderabad: టీచర్, రాజేశ్ చనిపోవాలనుకున్నారు?.. పోలీసుల చేతికి కీలక ఆధారాలు
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
TSPSC: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మరో 13 మంది డిబార్
-
Crime News
Nellore: భర్త అంత్యక్రియలు ముగిసిన కొన్ని గంటలకే భార్య మృతి
-
Viral-videos News
Viral Video: ఇదేం వెర్రో..? రన్నింగ్ కారుపై పుష్ అప్స్ తీస్తూ యువకుడి హల్చల్!