Ukraine Crisis: అఫ్గానిస్థాన్‌ తరహాలో ఉక్రెయిన్‌లో దెబ్బతిన్న రష్యా..

ఉక్రెయిన్‌ ఆక్రమణలో రష్యా తీవ్రంగా దెబ్బతిందని బ్రిటన్‌ చెబుతోంది. ఈ సైనిక చర్యలో రష్యన్ల మృతుల సంఖ్య.. గతంలో అఫ్గాన్‌ ఆక్రమణ సమయంలో సొవియట్‌ సేనల నష్టాలతో సమానం ఉంటుందని యూకే

Published : 24 May 2022 01:13 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌ ఆక్రమణలో రష్యా తీవ్రంగా దెబ్బతిందని బ్రిటన్‌ చెబుతోంది. ఈ సైనిక చర్యలో రష్యా వైపు ప్రాణ నష్టం.. గతంలో అఫ్గాన్‌ ఆక్రమణ సమయంలో సొవియట్‌ సేనల నష్టాలతో సమానమని యూకే రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. ‘‘పేలవమైన వ్యూహాలు, కమ్యూనికేషన్ల లోపాలు, కమాండింగ్‌ వ్యవస్థలో పదేపదే తప్పులు చేయడం వంటి కారణంగా రష్యా వైపు భారీగా మరణాలు నమోదవుతున్నాయి. డాన్‌బాస్‌లో అదే విధంగా పోరాటం కొనసాగిస్తున్నారు’’ అని రష్యా పరిస్థితిపై తమకు వచ్చిన ఇంటెలిజెన్స్‌ను యూకే వెల్లడించింది.

మంగళవారంతో ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన సైనిక చర్యకు మూడు నెలలు పూర్తవుతాయి. మార్చి నాటికి నాటో అధికారుల అంచనాల మేరకు దాదాపు 15 వేల మంది రష్యా సైనికులు చనిపోయారు. సోవియట్‌ సేనలు అఫ్గాన్‌ యుద్ధంలో దాదాపు ఇంతే సంఖ్యలో ప్రాణ నష్టాన్ని చవిచూశాయి. ఆ యుద్ధం 1979 నుంచి 1989 వరకు కొనసాగింది.

ఉక్రెయిన్‌ సైనికులకు శిక్షణ ఇస్తాం: న్యూజిలాండ్‌

ఉక్రెయిన్‌ సైనికులకు శిక్షణ ఇస్తామని న్యూజిలాండ్‌ ప్రధాని జెసెండా అర్డెన్‌ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ సైనికుల శిక్షణను  పర్యవేక్షించడానికి దాదాపు 30 మంది అదనపు సిబ్బందిని తాము యూకేకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. తమ సైనికులు ఎల్‌-119 తేలికపాటి తుపాకుల వినియోగంపై శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. బలగాలతోపాటు సైనిక పరికరాలను యూకే ఎయిర్‌ లిఫ్ట్‌ కార్యక్రమంలో భాగంగా తరలించనున్నట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని