Ukraine Crisis: టర్కీ చొరవ.. సమావేశం కానున్న రష్యా, ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రులు

రష్యా-ఉక్రెయిన్‌ దేశాలు చర్చలు జరిపేందుకు టర్కీ చేసిన రాయబారం సఫలమైంది. ఇరు దేశాల విదేశాంగ మంత్రులు సెర్గీ లావ్రోవ్, దిమిత్రో కులేబాలు సమావేశం కాబోతున్నట్లు.......

Published : 08 Mar 2022 01:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు తీవ్రతరం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల మధ్య సంధి కుదిర్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఫలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరు దేశాలు చర్చలు జరిపేందుకు టర్కీ చేసిన రాయబారం సఫలమైంది. రష్యా, ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రులు సెర్గీ లావ్రోవ్, దిమిత్రో కులేబాలు సమావేశం కాబోతున్నట్లు టర్కీ విదేశాంగ మంత్రి మెవ్లుట్ కావుసోగ్లు వెల్లడించారు. గురువారం దక్షిణ టర్కీలో వారు సమావేశం కానున్నట్లు తెలిపారు.

‘ఉక్రెయిన్‌- రష్యా వివాదం ముగింపు కోసం మా దేశ అధ్యక్షుడు రెసెప్‌ తైపీ ఎర్డోగాన్‌ తీసుకున్న చొరవ, దౌత్య ప్రయత్నాల ఫలితంగా.. ఆ దేశాల విదేశాంగ మంత్రులు సెర్గీ లావ్రోవ్, దిమిత్రో కులేబాలు సమావేశమయ్యేందుకు అంగీకరించారు’ అని టర్కీ విదేశాంగ మంత్రి మెవ్లుట్ కావుసోగ్లు ట్వీట్‌ ద్వారా తెలిపారు. అంటల్యా డిప్లొమసీ ఫోరం వేదికగా ఈ వారంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో తానూ భాగం అవుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రయత్నాలు శాంతి, స్థిరత్వానికి దారితీస్తాయని ఆశిస్తున్నానన్నారు. కాగా రష్యా కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని