Taiwan: మిస్టర్‌ మస్క్‌.. తైవాన్‌ అమ్మకానికి లేదు..!

టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ మరోసారి తైవాన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అది చైనాలో భాగమే అని పేర్కొన్నారు. దీనికి తైవాన్‌ ఘాటుగా సమాధానం ఇచ్చింది. 

Published : 14 Sep 2023 15:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనా (China) పక్షాన మాట్లాడుతూ తైవాన్‌(Taiwan)పై మరోసారి నోరు పారేసుకొన్న టెస్లా అధినేతకు ఘాటు జవాబు ఎదురైంది. మాకు సలహాలు చెప్పే బదులు చైనాలో నీ సంగతేమిటో చూసుకో అన్నట్లు తైవాన్‌ జవాబు చెప్పింది. ఇటీవల జరిగిన లాస్‌ ఏంజెల్స్‌లో జరిగిన ఆల్‌-ఇన్‌ సదస్సులో ఎలాన్‌ మస్క్‌ (Elon Musks) రిమోట్‌ విధానంలో ప్రసంగించారు. అమెరికాకు హవాయి వలే చైనాకు తైవాన్‌ అని వ్యాఖ్యానించారు. ‘‘నాకు బాగా తెలుసు.. తైవాన్‌ను చైనాలో విలీనం చేసుకొనేలా బీజింగ్‌ విధానాలు ఉంటాయి. వారి దృక్కోణంలో మనం హవాయిని ఇష్టపడటం వంటిది లేదా.. వారిలో అంతర్భాగమైనా.. విలీనం కాకుండా అసమగ్రంగా ఉండిపోయింది. విలీనానికి జరిగే ఏ ప్రయత్నాన్ని అయినా అమెరికా పసిఫిక్‌ దళం అడ్డుకొంటుంది’’ అని వ్యాఖ్యానించారు. 

ఈ వ్యాఖ్యలకు తైవాన్‌ విదేశాంగ మంత్రి జోసఫ్‌ వూ తీవ్రంగా స్పందించారు. ‘‘శ్రద్ధగా వినండి.. తైవాన్‌ పీఆర్‌సీలో భాగం కాదు. అలాగని అమ్మకానికి లేదు. మీరు ఎక్స్‌ (ట్విటర్‌)ను చైనాలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురమ్మని సీసీపీని కోరతారని నేను ఆశిస్తున్నా’’ అని ఎద్దేవా చేశారు. చైనాలో ప్రజలు ట్విటర్‌ను వినియోగించకుండా అధికారులు బ్లాక్‌ చేసిన విషయం తెలిసిందే. 

తైవాన్‌ను చుట్టేస్తున్న చైనా.. తమ భూభాగంలో కలిపేసేందుకు ‘బ్లూప్రింట్’ విడుదల

ఇప్పటికే చైనా నాయకత్వంతో రాసుకుపూసుకు తిరుగుతారనే పేరు మస్క్‌కు ఉంది. టెస్లా సహా పలు వ్యాపారాలు అక్కడ ఉన్నాయి.  ఈ నేపథ్యంలో ఆ దేశ అమెరికా వ్యాపారాల గురించి అడిని ప్రశ్నకు మస్క్‌ తైవాన్‌ను ఉదాహరణతో చెప్పాడు. అది కాస్తా వివాదాస్పదంగా మారింది. తాను ఎన్నోసార్లు చైనాలో పర్యటించానని, ఆ దేశంపై మంచి అవగాహన ఉందని మస్క్‌ పేర్కొన్నారు. గతంలో కూడా మస్క్‌ ఇటువంటి వ్యాఖ్యలు చేసి తైవాన్‌కు ఆగ్రహం తెప్పించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని