Zelensky: హఠాత్తుగా బ్రిటన్‌ చేరుకొన్న జెలెన్‌స్కీ.. ఉక్రెయిన్‌ పైలట్లకు అక్కడ శిక్షణ

ఉక్రెయిన్‌ ఫైటర్‌ జెట్‌ పైలట్లకు బ్రిటన్‌ శిక్షణ ఇవ్వనుంది. ఈ విషయాన్ని బ్రిటన్‌ ప్రధాని రుషిసునాక్‌ ధ్రువీకరించారు. 

Updated : 08 Feb 2023 16:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ(Zelensky) బ్రిటన్‌ చేరుకొన్నారు. రష్యాతో యుద్ధం మొదలైన తర్వాత నుంచి ఆయన యూకే రావడం ఇదే తొలిసారి. ఈ పర్యటన వివరాలు ముందుగా ఎక్కడా బయటకు వెల్లడికాలేదు. ఈ పర్యటనలో ఆయన బ్రిటన్‌ ప్రధాన మంత్రి రిషిసునాక్‌(Rishi Sunak)తో కూడా భేటీ కానున్నారు. యూకే పార్లమెంట్‌ను ఉద్దేశించి కూడా ఆయన ప్రసంగించే అవకాశాలున్నాయి. దీంతోపాటు ఉక్రెయిన్‌ దళాలకు శిక్షణ ఇస్తున్న కేంద్రాలను కూడా సందర్శించనున్నారు.

ఈ పర్యటనపై యూకే ప్రధాని రిషి సునాక్‌ మాట్లాడుతూ జెలెన్‌స్కీ పర్యటన ఆ దేశ ధైర్యాన్ని, పోరాట స్ఫూర్తి, బ్రిటన్‌తో ఉన్న విడదీయరాని బంధాన్ని తెలియజేస్తోందన్నారు. 2014 నుంచి ఆ దేశం ఆత్మరక్షణ చేసుకొంటూ సార్వభౌమాధికారాన్ని కాపాడుకొనేలా దళాలకు యూకే కీలకమైన శిక్షణ ఇస్తోందని తెలిపారు. ‘‘మా శిక్షణ కార్యక్రమాన్ని ఉక్రెయిన్‌ సైనికుల నుంచి మెరైనర్లు, పైలట్లకు విస్తరిస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. కేవలం తాత్కాలికంగా సైనిక సామగ్రి ఇవ్వడమే కాకుండా.. వచ్చే మరికొన్నేళ్లు దీర్ఘకాలం ఆ దేశంతో కలిసి ఉంటామన్న  నిబంద్ధతను తెలియజేస్తోంది’’ అని బ్రిటన్‌ ప్రధాని రుషిసునాక్‌ పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని