శ్రీకాకుళం జిల్లాలో 40 కోతుల మృతి.. విష ప్రయోగంపై స్థానికుల అనుమానం

శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం శిలాగం గ్రామ సమీప రహదారిపై 40 కోతుల మృతదేహాలు కనిపించడం కలకలం రేపింది. రోడ్డు పక్కన తోటలో అపస్మారక స్థితిలో మరికొన్ని కోతులు కనిపించాయి. వాటికి స్థానికులు బిస్కెట్లు, నీళ్లు అందించారు. కోతులపై విష ప్రయోగం జరిగి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోతులు మృతదేహాలను పరీక్షించేందుకు అటవీశాఖ అధికారులు బయలుదేరారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి కారణాలు తెలుపుతామని వెల్లడించారు.  

Updated : 25 Oct 2022 17:25 IST

Tags :

మరిన్ని