ప్రముఖ భోజ్‌పురి సింగర్‌ నిషా ఉపాధ్యాయ్‌పై కాల్పులు!

ప్రముఖ భోజ్‌పురి (Bhojpuri Singer) సింగర్‌ నిషా ఉపాధ్యాయ్‌పై.. గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. బిహార్‌లోని సరన్ జిల్లాలో నిర్వహించిన లైవ్‌ షోలో.. ఆమెపై దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో నిషా (Nisha) ఎడమ కాలిలో బుల్లెట్ దిగినట్లు పోలీసులు తెలిపారు. నిషాను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే, సంఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని, సోషల్ మీడియా ద్వారా తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. దాని ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. వేడుకలో గాల్లో కాల్పులు జరుపుతుండగా, అనుకోకుండా సింగర్‌కు బుల్లెట్ గాయమైందని అనుమానిస్తున్నారు

Published : 02 Jun 2023 14:16 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు