AP News: ఏపీ బడ్జెట్ రూపకల్పన, నిర్వహణ తీరు సరిగా లేదన్న కాగ్..!

ఏపీ బడ్జెట్ రూపకల్పన, నిర్వహణ తీరు సరిగ్గా లేదని కాగ్ స్పష్టం చేసింది. కొన్నిచోట్ల కేటాయింపుల కంటే.. అధికంగా వ్యయం చేశారని, మరికొన్ని చోట్ల కేటాయింపులు ఖర్చుపెట్టక పోయేసరికి నిధులు మిగిలిపోయాయని ఆక్షేపించింది. వివిధ పథకాలకు కేంద్రం నిధులిచ్చినా వాడుకోలేదని గుర్తించింది. 164 రోజులు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయానికి వెళ్లడం.. పేలవమైన నగదు నిర్వహణ సామర్థ్యాన్ని సూచిస్తోందని కాగ్ అభిప్రాయపడింది. 

Published : 26 Mar 2023 09:28 IST

మరిన్ని