CM Jagan: వైకాపా ‘జయహో బీసీ’ సభలో.. మద్యం సీసాలు.. ఖాళీ కుర్చీలు..!

విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో వైకాపా నిర్వహించిన జయహో బీసీ సభకు తరలివచ్చిన వారి నుంచి పెద్ద సంఖ్యలో మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిని స్టేడియం లోపలికి పంపించే క్రమంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. ఈ సమయంలో మద్యం సీసాలను వారి వద్ద గుర్తించి వాటిని ప్రవేశ ద్వారం వద్దనే తీసుకుని ఆ తర్వాతే లోపలికి పంపించారు. ఈ మద్యం సీసాలను ఎప్పటికప్పుడు డస్ట్‌బిన్‌లోకి వేయించారు. మద్యం సీసాల స్వాధీనం చిత్రాలను తీస్తున్నట్లు గమనించిన పోలీసులు వెంటనే ఆ ప్రవేశ ద్వారం మూసివేయించి అక్కడి జనాలను వేరే మార్గంలోకి మార్పు చేశారు. సీఎం ప్రసంగం జరుగుతున్న సమయంలోనే ఒకేసారి వచ్చిన వారంతా భోజనానికి తరలివెళ్లారు. 80 వేల మంది సభలో పాల్గొన్నారంటూ సీఎం పేర్కొన్న సమయంలో మైదానంలోని వెనుక సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. 

Updated : 07 Dec 2022 16:44 IST

CM Jagan: వైకాపా ‘జయహో బీసీ’ సభలో.. మద్యం సీసాలు.. ఖాళీ కుర్చీలు..!

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు