Kurnool: భూ వివాదంపై.. రైతుకు తుపాకీతో బెదిరింపులు!

కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండలం హులికన్విలో ఓ రైతు.. మరో రైతు కుటుంబాన్ని తుపాకీతో బెదిరించిన ఘటన కలకలం రేపింది. గ్రామంలో రెవెన్యూ అధికారులు భూములు రీ సర్వే చేశారు. సర్వే నంబర్ 29లోని 33 సెంట్ల  భూమి.. పక్కనే ఉన్న సర్వే నంబర్ 30లోకి వెళ్లిపోయింది. సుమారు 33 సెంట్ల భూమి.. రీ సర్వేలో తారుమారుకావటంతో భూమిని కోల్పోయిన రైతులు అప్పల నాగరాజు, అప్పల ఉరుకుందప్ప హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు మరోసారి సర్వే చేసి 29వ సర్వే నంబర్‌కే 33 సెంట్ల భూమి చెందుతుందని తేల్చి చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన చిన్నఈరన్న, మహదేవ అనే వ్యక్తులు తుపాకీతో బెదిరింపులకు గురి చేశారు.

Published : 10 Apr 2024 14:37 IST

Tags :

మరిన్ని