Botsa: రాజధాని ప్రాంతమంటే.. బ్రహ్మపదార్థం కాదు: బొత్స

అమరావతిలో ఆర్-5 జోన్ అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్-5 జోన్‌లో సామాన్యులు, మధ్యతరగతి వారికి ఆ ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇస్తామంటే.. కాదనడం సరికాదన్నారు. రాజధాని నివాసిత ప్రాంతం కాదా? 30 వేల ఎకరాల్లోనూ భవనాలు కట్టాలని ఇచ్చారా? అంటూ ప్రశ్నించారు. ప్రజా వినతుల పరిష్కారానికి సీఎం జగన్‌ ప్రారంభించిన ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని.. విజయనగరంలో అధికారులతో కలిసి మంత్రి బొత్స వీసీలో వీక్షించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. 

Published : 09 May 2023 16:53 IST

మరిన్ని