TDP: నారా లోకేశ్‌కు మద్దతుగా ఎన్టీఆర్‌ కుటుంబసభ్యుల ప్రచారం

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి నారా లోకేశ్‌కు (Nara Lokesh) మద్దతుగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు రంగంలోకి దిగారు.

Updated : 07 May 2024 13:07 IST

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి నారా లోకేశ్‌కు (Nara Lokesh) మద్దతుగా ఎన్టీఆర్ కుటుంబసభ్యులు రంగంలోకి దిగారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు 15 మంది లోకేశ్‌కు మద్దతుగా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బాబు సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ ఇంటింటా ప్రచారం చేపట్టారు. లోకేశ్‌ గెలిస్తేనే మంగళగిరి అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని ప్రజలకు వివరించారు. స్థానికులతో కలిసిపోయి వారి సమస్యలను వింటూ ముందుకు సాగారు. 

Tags :

మరిన్ని