Telangana News: తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితులకు 14 రోజుల రిమాండ్

సంచలనం సృష్టించిన తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసులో ముగ్గురు నిందితులకు తెలంగాణ ఏసీబీ ప్రత్యేక కేసుల న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించింది. పోలీసులు వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. తెలంగాణ హైకోర్టులో దాఖలైన వేర్వేరు పిటిషన్లపై న్యాయమూర్తులు.. ఓ వైపు రిమాండ్, మరో వైపు దర్యాప్తు నిలిపివేయాలంటూ భిన్నమైన తీర్పులు వెలువరించారు. తదుపరి విచారణ కోసం నిందితులను కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల విజ్ఞప్తిని.. తెలంగాణ ఏసీబీ కోర్టు తిరస్కరించింది. 

Published : 30 Oct 2022 10:31 IST

మరిన్ని