రోడ్డుపై సొల్లు కబుర్లు ఏంటి? వైకాపా ఎమ్మెల్యేపై తిరగబడిన యువతి

కృష్ణా జిల్లాలో పామర్రు (Pamarru) ఎమ్మెల్యే అనిల్ కుమార్‌ (Anil Kumar)పై ఓ యువతి తిరగబడింది. కురుమద్దాలిలో నడిరోడ్డుపై ఎమ్మెల్యే బహిరంగ సభ నిర్వహించారు. సుమారు అరగంటకుపైగా రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అక్కడే ఉన్న పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. సహనం కోల్పోయిన ఓ యువతి.. ఎమ్మెల్యే వాహనం వద్దకు వచ్చి గళమెత్తింది. అయితే, ఆమెను పోలీసులు, వైకాపా మహిళా కార్యకర్త అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేయగా.. రోడ్డుపై సొల్లు కబుర్లు ఏంటని యువతి నిలదీసింది.

Published : 29 May 2023 21:28 IST

Tags :

మరిన్ని