Sircilla: యజమానులు కానున్న సిరిసిల్ల నేతన్నలు..!

వస్త్ర పరిశ్రమకు దేశంలోనే పేరు గాంచిన ప్రాంతం సిరిసిల్ల. ఇంటింటా నేత కార్మికులు, వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్న టెక్స్‌టైల్ పార్కులతో వస్త్ర పరిశ్రమకు చిరునామాగా మారిన ప్రాంతమిది. ఒకప్పుడు నేత కార్మికుల ఆత్మహత్యలతో ఉరిసిల్లగా మారిన సిరిసిల్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పవర్‌లూమ్‌ పరిశ్రమకు కేంద్రంగా మారింది. అదే క్రమంలో అక్కడి నేత కార్మికుల బతుకులు మార్చే దిశగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా సిరిసిల్లలో వర్కర్‌-టు-ఓనర్ పథకాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. 

Published : 24 Mar 2023 12:48 IST

మరిన్ని