APSRTC: కొత్త బస్సుల్లేవు.. డొక్కు బస్సులతో తరచూ ప్రమాదాలు

జగన్‌ ప్రభుత్వం ఆర్టీసీ (APSRTC) బస్సులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. చాలం చెల్లిన డొక్కు బస్సులనే రోడ్లపై తిప్పుతోంది. ఒక బస్సు 12 లక్షల కి.మీ.లు తిరిగితే కాలం చెల్లినట్లే. ప్రస్తుతం ఆర్టీసీలో ఇలాంటి బస్సులు 4,445 ఉన్నాయి. 15 ఏళ్లు దాటిన ప్రభుత్వ రంగ సంస్థల బస్సులను ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి రోడ్డెక్కించకూడదని కేంద్రం తీసుకొచ్చిన నిబంధనతో 214 బస్సులను పక్కన పెట్టేశారు. ఆ తర్వాత కూడా 12 లక్షల కి.మీ.లకుపైగా తిరిగిన 4,445 బస్సులను నడుపుతూనే ఉన్నారు. వీటిలో 15 లక్షల కి.మీ.లకు పైగా ప్రయాణించినవి 1,626 ఉండటం గమనార్హం. ఇలాంటి వాటితో ప్రయాణికుల భద్రతకు ప్రమాణాలను ఏమేరకు పాటిస్తున్నారో ముఖ్యమంత్రే చెప్పాలి.

Published : 29 Dec 2023 09:54 IST

Tags :

మరిన్ని