Rashmika: రష్మిక

నటిగా కెరీర్‌ మొదలుపెట్టిన కొంతకాలంలోనే అందం, అభినయంతో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు రష్మిక (Rashmika). దక్షిణాది, ఉత్తరాదిలో సినిమాలు చేస్తూ దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారీ భామ. తాజాగా ఆమె ‘యానిమల్‌’(Animal)తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే రష్మికకు సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలు.

Updated : 01 Dec 2023 14:38 IST
1/28
కర్ణాటకలోని కొడగు జిల్లాలో 1996లో రష్మిక జన్మించారు. బెంగళూరులోని ఎం.ఎస్‌.రామయ్య కళాశాలలో సైకాలజీ, జర్నలిజంలో ఆమె డిగ్రీ పూర్తి చేశారు.

2/28
ఇంటర్‌ చదువుతోన్న రోజుల్లోనే ఆమెకు తొలిసారి సినిమా అవకాశం వచ్చింది. కాకపోతే ఆమె కుటుంబసభ్యులు దానికి అంగీకారం తెలపలేదు.

3/28
డిగ్రీలో ఉన్నప్పుడు కాలేజీలో జరిగిన అందాల పోటీలో ఆమె పాల్గొని విజయాన్ని అందుకున్నారు. అదే సమయంలో జాతీయ స్థాయిలో జరిగిన అందాల పోటీల్లోనూ పాల్గొని  టైటిల్‌ కైవసం చేసుకున్నారు.

4/28
అందాల పోటీ అనంతరం రష్మికకు సినిమా అవకాశాలు వచ్చాయి. దాదాపు ఐదారు సినిమాలకు ఆడిషన్స్‌ కూడా ఇచ్చారు. కాకపోతే ఏదీ పట్టాలెక్కలేదు.

5/28
రిషబ్‌శెట్టి తెరకెక్కించిన ‘కిరిక్‌పార్టీ’తో ఆమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అప్పుడు ఆమె వయసు 20 ఏళ్లు.

6/28
2016లో విడుదలైన ‘కిరిక్‌పార్టీ’ కన్నడలో సూపర్‌హిట్‌ అందుకుంది. ఈ సినిమా తర్వాత రష్మికకు కన్నడలో అవకాశాలు వరుస కట్టాయి.

7/28
2018లో వచ్చిన ‘ఛలో’తో ఆమె తెలుగులోకి తెరంగేట్రం చేశారు. నాగశౌర్య హీరోగా నటించారు.

8/28
అదే ఏడాది ‘గీత గోవిందం’ ఆమెకు తెలుగులో సూపర్‌హిట్‌ అందించింది. 

9/28
‘దేవదాస్‌’, ‘డియర్‌ కామ్రేడ్‌’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’, ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’, ‘పుష్ప’ వంటి తెలుగు చిత్రాలతో ఆమె ప్రేక్షకులను అలరించారు.

10/28
‘పుష్ప: దిరైజ్‌’.. ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇందులో శ్రీవల్లిగా ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

11/28
‘గుడ్‌ బై’, ‘మిషన్‌ మజ్ను’ వంటి బాలీవుడ్‌ చిత్రాల్లోనూ ఆమె నటించారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘యానిమల్‌’ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

12/28
జపనీస్ ఫ్యాషన్‌ బ్రాండ్ ఒనిట్సుకా టైగర్‌కి రష్మిక బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.

13/28
జపానీస్‌ వెబ్‌ సిరీస్‌ ‘నరుటో’కు రష్మిక వీరాభిమాని.

14/28
సోషల్‌మీడియాలో ఆమె ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. అభిమానులకు చేరువగా ఉండాలనే ఉద్దేశంతో 2014లో ఆమె ఇన్‌స్టాలోకి అడుగుపెట్టారు.

15/28
ఇన్‌స్టా వేదికగా ప్రస్తుతం ఆమెను 39.9 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.

16/28
17/28
18/28
19/28
20/28
21/28
22/28
23/28
24/28
25/28
26/28
27/28
28/28

మరిన్ని